ఇప్పుడు పవన్ సహకారంతో అధికారంలోకి రావాలని పగటికలలు కంటున్న బాబు
2014–19 మధ్య అవినీతి, అక్రమాలకు రాష్ట్రాన్ని చంద్రబాబు ధ్వంసం చేశారని నిర్ధారణకు వచ్చిన జనం
అందుకే 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలు
సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపిన సీఎం జగన్
నీ విధ్వంస పాలనను మళ్లీ జనం ఎందుకు కోరుకుంటారు బాబూ
తనను కలిసిన మీడియాతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
వచ్చే ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహకారంతో అధికారంలోకి రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పగటి కలలు కంటున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలతో 2014–19 మధ్య రాష్ట్రాన్ని చంద్రబాబు ధ్వంసం చేశారని ప్రజలకు నిర్ధారణకు వచ్చే 2019 ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాల్లో గెలిపించి వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందించారని గుర్తు చేశారు. చంద్రబాబు ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనతో ఒక్కో ఇటుక పేర్చుకుంటూ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు దన్నుగా నిలిచారని వివరించారు. మంచి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు అండగా నిలుస్తున్నారు కాబట్టే 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము మందుకెళ్లున్నామన్నారు. కార్యకర్తల నుంచి నేతల వరకూ అందరినీ సీఎం వైఎస్ అక్కున చేర్చుకున్నారని చెప్పారు. గత ఎన్నికల కంటే మరింత మెరుగైన ఫలితాల కోసమే ఒక చోట టికెట్ ఇవ్వలేకపోతే మరో చోట కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉంటారని.. ఎక్కడైనా చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే సర్దుకుంటాయన్నారు. రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకెళ్తుంటే.. సీఎం వైఎస్ జగన్ ఏం తప్పు చేస్తారా? దానిపై ఎలా చిల్లర రాజకీయాలు చేద్దామా అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారంటూ సజ్జల దెప్పిపొడిచారు. ఎత్తిచూడానికి తప్పులు ఏమీ లేకపోవడంతో సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వంపై ఎల్లో మీడియాతో నిత్యం బురదజల్లుతూ తప్పుడు వార్తలు రాయిస్తూ.. ఆ భ్రమల్లోనే చంద్రబాబు బతుకుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అలాంటి చిల్లర రాజకీయాలు మానుకో అంటూ చంద్రబాబుకు హితవు పలికారు. ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి చంద్రబాబు టీడీపీని లాక్కున్నప్పటి నుంచి.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచిన దాఖాలాలు లేవని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ స్కాంలో రిమాండ్‌పై జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏ ఒక్కరూ పట్టించుకోలేదని అన్నారు. శిథిలమైపోయిన టీడీపీని ఏలుతున్న చంద్రబాబుకు జనసేన కలిసిరాకపోతే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు ఉన్నారో కూడా తెలియన దుస్థితిలో.. పవన్‌ను నమ్ముకునే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎధ్దేవా చేశారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే కాపు సామాజికవర్గం అంతా తనకు మద్దతు ఇస్తుందని చంద్రబాబు పగటికలలు కంటున్నారని విమర్శించారు. నీ విధ్వంస పాలనను 2019 ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టారని.. మళ్లీ అలాంటి పాలన కావాలని జనం కోరుకోరు అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని.. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యమని తేల్చిచెప్పారు. టిడిపి 100 స్దానాలలో పోటీ చేస్తుందా. లేదా 90 టిడిపి తీసుకుని 85 పవన్ కల్యాణ్ కు ఇస్తారా. జనసేన 100 స్దానాలలో పోటీ చేసి టిడిపి మిగిలిన వాటిలో పోటీ చేస్తుందా. ముఖ్యమంత్రి అభ్యర్ది ఎవరు. ఈ ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి.ఎందుకంటే వారికి ఏ విషయంలో స్పష్టత లేదు.అసలు 175 స్దానాలలో వారికి అభ్యర్దులు ఉన్నారా అనేది అనుమానమే అని విమర్శించారు.జనసేన-టిడిపి సమన్వయకమిటి సమావేశాలు ఏమయ్యాయి.రెండు మీటింగ్ లు జరగగానే వారు కొట్టుకున్నారు అని అన్నారు. చంద్రబాబు కోసం మృతి చెందారంటున్నవారికి ఎంతమందికి పరిహారం ఇచ్చారు. ఇచ్చిన చెక్కులు చెల్లినాయా. లోకేష్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర అనేది నడిచాడా లేదనేది నాకు అనుమానమే. టిడిపి ఏ యాక్టివిటి ఎందుకు చేస్తున్నారో ఏమైనా అర్ధం ఉందా.చంద్రబాబును జైలులో వేసినప్పుడు ఎక్కడాలేని రోగాలన్నీ చంద్రబాబుకే ఉన్నాయని వాదించారు. ఇప్పుడేమో రొమ్ము విరుచుకుని లోకమంతా తిరుగుతానని అంటున్నాడు. ఎక్కడనుించి వచ్చింది ఈ శక్తి అంతా ఆయనే చెప్పాలి. జైలులో ఉన్నప్పుడు ఆయన భార్య,కోడలు తిరుగుతారని అన్నారు. ఇప్పుడు వాళ్లేమయ్యారు.ఆరోజు తిరగాల్సిన కొడుకు ఇన్నాళ్ళు ఎక్కడ పడుకున్నాడు. ఈనాడు మూడ్రోజులలో ఎలా పాదయాత్ర ముగిస్తున్నాడు. తెలంగాణాలో వాళ్ళు ఏం చేశారు. కాంగ్రెస్ టిడిపిని గెలిపించిందని ఊదరగొడుతున్నారు. సెట్లర్ల ఓట్లు ఎక్కువున్న చోట్ల కాంగ్రెస్ ఒోడిపోయింది. టిడిపి, కాంగ్రెస్ తో ఉన్నామని చెప్పినందువల్ల మిగిలినవాళ్లంతా ఏకమైనారనే ఒరకమైన ప్రచారం హైద్రాబాద్ రిజల్ట్స్ చూస్తే అర్ధమవుతుంది. పవన్ కల్యాణ్ పోటీచేసిన చోట్ల టిడిపి ఓట్లు ఎందుకు వేయించలేకపోయారు అని ప్రశ్నించారు.ఇలా చాలా ప్రశ్నలు వస్తుంటాయి.మీడియావారే వారిని అడగాలి. వాళ్ల పార్టీల సంగతి చూసుకోకుండా మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుతుంటారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మధ్దతు ఇచ్చారు.ఇప్పుడు ఏపి ఎన్నికలలో షర్మిల ఇక్కడకు కాంగ్రెస్ తరపున వస్తారు అని కాంగ్రెస్ నేతలంటున్నారనే మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ ఏ రాజకీయపార్టీ ఐనా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది.ఎవరు ఉన్నా అందరూ కలసి వచ్చిన ఫేస్ చేయగలం. ఫేస్ చేసి అందరికంటే మిన్నగా ఢంపింగ్ మెజారిటీతో ప్రజల ఆశీస్సులు పొందగలం అన్నారు. మా టీం చాలా ఫర్ ఫెక్ట్ గా ఉంది. పబ్లిక్ గా మనకు తెలిసింది ఏమంటే షర్మిల తెలంగాణాలో రాజకీయపార్టీ పెట్టారు. తెలంగాణాలో యాక్టివిటి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే నిజమని అనుకుంటున్నాం. కాంగ్రెస్ నేతల ఊహాగానాలు కావచ్చు.వారికి ఏదైనా సమాచారంతో మాట్లాడి ఉండవచ్చు అని అనుకుంటున్నాను.