ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి : అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎలా చేస్తారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అంగన్వాడీల న్యాయపోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ‘‘అంగన్వాడీపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎందుకంత కక్ష? టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరిస్తామని అచ్చెన్న హామీ ఇచ్చారు. మరోవైపు అంగన్వాడీల నిరవధిక సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె మరింత ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.