విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భీమ్ దళిత సేన ఆధ్వర్యంలో మహిళలకు జీవనోపాధి కోసం కూరగాయలు విక్రయించే నాలుగు చక్రాల తోపుడు బండిని అందించారు. స్థానిక కస్తూరిబాయిపేట లో జై భీమ్ దళిత సేన రాష్ట్ర కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడు ఆదాడి మల్లికార్జునరావు (మల్లెన్న) అనేక ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా నిరుపేద మైనారిటీ మహిళ పటాన్ సాజన్(52) కు కూరగాయలు అమ్మే నాలుగు చక్రాల తోపుడు బండి వితరణ చేశారు. జై భీమ్ దళిత సేన 2014 నుంచి రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాష్ట్రం లో 26 జిల్లాల్లో జై భీమ్ దళిత సేన యువత చాలా చురుగ్గా పనిచేస్తున్నారన్నారు. పేద ఎస్సీ, ఎస్టీ , దళిత , మైనారిటీ , కుటుంబాలను గుర్తించి వారికి జీవనోపాధికి అవసరమైన సదుపాయాల్ని కల్పించడం, వారి అవసరాలు బట్టి వారి తరపున ప్రభుత్వానికి విన్నపాలు చేయడం, వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2024 నూతన సంవత్సరం నుంచి రాష్ట్రంలో జై భీమ్ దళిత సేన ఆధ్వర్యంలో ప్రతి నిత్యం సేవా కార్యక్రమంలో పాల్గొనేలా, ప్రజల అవసరాలను బట్టి ఏ విషయం మీద అయినా పోరాటాలతో నిరుపేద కుటుంబానికి ఆదుకుని వారి అవసరాన్ని తీర్చడానికి అనేక కార్యాచరణ చేశామని, రాష్ట్ర అధ్యక్షుడు ఆదాడి మల్లికార్జునరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ టీ ఆర్ జిల్లా నాయకులు ఎస్. అప్పారావు , దామర్ల దుర్గా ,తిరుపాల్ , సాయి , చందు ,తదితర నాయకులు పాల్గొన్నారు.