ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ
గుంటూరు : కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం కలిశారు. ఆప్కాస్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మిగిలిన సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరింది. మహాసభ జ్ఞాపికను నూతన కమిటీ అందచేసింది. కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ మంగళవారం తాడేపల్లి లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం రాష్ట్ర స్థాయిలో జరిగిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రధమ మహా సభలో ఎన్నికైన నూతన రాష్ట్ర కమిటీ ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కలిశారు.
ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీ ఆప్కాస్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు భరోసా కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఏజెన్సీల చేతిలో నలిగిపోతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రక్షించి ఆప్కాస్ ఏర్పాటు చేయడం పట్ల ఉద్యోగులకు ఊరట కలిగిందని రాష్ట్ర కమిటీ ఆయనకు తెలియజేస్తూ మిగిలి ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కోరింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మిగిలిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రధమ మహాసభ జ్ఞాపికను అందజేసింది. ఈ కార్యక్రమంలో నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కే సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు, ట్రెజరర్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధు, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లేశ్వరరావు, వీఆర్ఏల రాష్ట్ర సంఘం అధ్యక్షులు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
[https://bloomtimes.org/images/srilekha_/out%20sourcing.jpg]