ఢిల్లీ తెలంగాణ భవన్పై మంత్రి కోమటిరెడ్డి రివ్యూ : ఢిల్లీ తెలంగాణ భవన్పై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ నిర్వహించారు.19 ఎకరాల ఉమ్మడి ఏపీ భూమిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సైట్ ఇన్ఫెక్షన్ చేస్తామన్నారు. ఎల్లుండి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తామన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైంది. మార్చిలోపు భవన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉమ్మడి భవన్ ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 58:42 శాతంలో పంపకాలు ఉంటాయన్నారు. డిజైన్లు ఖరారు చేసి టెండర్లు పిలిచి ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తున్నామన్నారు.