డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈఓగా బాధ్యతల్ని స్వీకరించిన డి.కె.బాలాజీ
మంగళగిరి : డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈఓగా సోమవారం మంగళగిరిలోని ట్రస్ట్ ఆఫీసులో డి.కె.బాలాజీ బాధ్యతల్ని స్వీకరించారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ కు బదిలీ పై బాలాజీ వచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా ఆరోగ్యశ్రీ ద్వారా లబ్దిదారులకు సేవలందించాలని సిఇఓ డి.కె.బాలాజీ కోరారు. అందుకుగారు ఆరోగ్య శ్రీ అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలన్నారు. కొత్త సిఇఓకు ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.