కొవ్వూరు : రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితను కొవ్వూరుకు ఏఎంసీ చైర్ పర్సన్ గా నూతనంగా ఎన్నికైన ఉప్పులూరి విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నియామక పత్రాలను హోంమంత్రి చేతులు మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న విజయలక్ష్మికి హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. మార్కెటింగ్ కమిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని హోంమంత్రి తానేటి వనిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.