*సమస్యల పరిష్కారానికి కృషి : అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన కే సుమన్ మాట్లాడుతూ నాయకత్వలేనితో బాధపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ అండగా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నిలబడుతుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు మాట్లాడుతూ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అలాగే ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు వారి రాష్ట్ర కమిటీ సహకారాలతో ప్రతి సందర్భంలో ప్రతి సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం శాఖల వారి అలాగే ప్రధాన సమస్యలపై ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పలువురు ప్రసంగించి వారి గోడును ప్రభుత్వానికి మహాసభ వేదికగా వినిపించారు. నూతనంగా ఎన్నుకోబడ్డ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గంతో పాటు వారి అనుబంధ సభ్య సంఘాల నాయకులు ఇతర పెద్దలు కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి అసోసియేట్ ప్రెసిడెంట్ టీవీ ఫణి పేర్రాజు, ఏపీ జెఎసి అమరావతి మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ పారే లక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, అసోసియేట్ ప్రెసిడెంట్ శివ కుమారి రెడ్డి, ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య,గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్లయ్య ప్రధాన కార్యదర్శి జ్యోతి, డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, ఏపీ జెఎసి అమరావతి గుంటూరు అనంతపురం జిల్లా చైర్మన్లు తో పాటు 26 జిల్లాలకు చెందిన అన్నిడిపార్టుమెంట్లులకు చెందిన ఔట్ సోర్శింగు ఉద్యోగులు వేల సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేసారు.
నూతన రాష్ట్ర నాయకులు వీరే : 1. కే సుమన్ – రాష్ట్ర అధ్యక్షులు – మెడికల్ డిపార్ట్మెంట్ – ఎన్టీఆర్ జిల్లా. 2. పి. గురునాథ్ – అసోసియేట్ ప్రెసిడెంట్ – మున్సిపల్ – తూర్పు గోదావరి. 3. జి సంపత్ – వైస్ ప్రెసిడెంట్ – ఎస్ఎస్సి బోర్డు – హెచ్ ఓ డి (హెడ్ ఆఫీస్). 4. ఎస్వీ కృష్ణ.- వైస్ ప్రెసిడెంట్ – హౌసింగ్ – నెల్లూరు. 5. జి మెర్సీ కుమారి. వైస్ ప్రెసిడెంట్ – గురుకులం – బాపట్ల. 6. కే జై రామ్ – వైస్ ప్రెసిడెంట్ – రెవెన్యూ – సీసీ ఎల్ ఏ ఆఫీస్, హెచ్ ఓ డి (హెడ్ ఆఫీస్). అల్లం సురేష్ బాబు – జనరల్ సెక్రెటరీ – సోషల్ వెల్ఫేర్ – నెల్లూరు. పి వేణు , ఆర్గనైజింగ్ సెక్రెటరీ – స్పోర్ట్స్ – ప్రకాశం. 9. ఎం మధు బాబు – సెక్రటరీ – మున్సిపల్ – గుంటూరు. 10. పి. కిషోర్ కుమార్ – సెక్రెటరీ – స్త్రీ శిశు సంక్షేమం – ఏలూరు. 11. పి సుధీర్ కుమార్ – సెక్రటరీ – ఆర్టీసీ – గుంటూరు. 12. సిహెచ్. రమణ మూర్తి – సెక్రెటరీ – మున్సిపల్ – విజయవాడ. 13. పి విజయభారతి – సెక్రటరీ – ఈఎస్ఐ – విజయవాడ. 14. ఎం రామకృష్ణ – సెక్రటరీ – మెడికల్ అండ్ హెల్త్ – ఎన్టీఆర్ జిల్లా. 15. యు అనిల్ కుమార్ – ట్రెజరర్ – వెటర్నరీ – గుంటూరు ఎన్నికయ్యారు.