రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతోపాటు సీఎస్ శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సింగరేణి సి.ఎం.డి శ్రీధర్, సీపీడీసీఎల్ సి.ఎం.డి రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సి.ఎం.డి గోపాల్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.