హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి శనివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. సోనియా 78వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో 78 కేజీల కేక్‌ను కట్ చేసి పరస్పరం కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోనియా జన్మదిన వేడుకలకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మేల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సఫర్ అవుతున్నామని, కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ నాయకత్వంలో ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుందన్నారు. తమది అబద్ధాలు చెప్పే పార్టీ కాదని వీహెచ్ పేర్కొన్నారు.