అమరావతి : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వ్యవసాయం పట్ల వైసీపీ సర్కారు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వల్ల అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వరి వేసిన తులిమెల్లి బసవ పున్నయ్య పంట నష్టపోయి తీవ్రమనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడటం తనను తీవ్రంగా కలచివేసిందని లోకేష్ అన్నారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బసవపున్నయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేష్ చెప్పారు. మొన్నటివరకూ కరువుతో ఎండిన పంటలు అప్పులు చేసి కాపాడితే, తుఫాను వచ్చి మొత్తం ఊడ్చేసిందన్నారు. ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తోందని, అన్నదాతలారా అధైర్యపడొద్దు, మూడు నెలలు ఓపిక పట్టండని, రైతుబంధువైన టీడీపీ – జనసేన ప్రభుత్వం వస్తుందని, మీ కష్టాలు తీరుస్తుందని నారా లోకేష్ తెలిపారు.
[https://bloomtimes.org/images/srilekha_/Nara%20Lokesh.jpg]