విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన చైర్మన్ గా వి అనంత రామకృష్ణ ప్రసాద్ (అమ్మ ప్రసాద్) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గొల్లపూడి లో ఉన్న ఎండోమెంట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా వి. అనంత రామకృష్ణ ప్రసాద్( అమ్మ ప్రసాద్) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, పేరి కామేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ , ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ నాగదేసి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ బోర్డు మెంబర్, పెద్దిపోగు కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సీఈఓ జి .నాగసాయి, బ్రాహ్మణ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఏ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ వి. అనంత రామకృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఈ సంస్థకే చైర్మన్ గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సంస్థ అభివృద్ధికి అధిక డిపాజిట్లు కస్టమర్ నుండి స్వీకరిస్తూ , బ్రాహ్మణ కులాల్లో వెనుకబడే వారికి వారి విద్య, వైద్య గృహ రుణాలను మంజూరు చేస్తూ వాళ్ళ అభివృద్ధికి కూడా అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు.
ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్యలకు వాళ్లు విద్య పరిపూర్ణంగా పూర్తి చేసేందుకు విద్యార్థులు మా సొసైటీ ద్వారా విద్యా రుణాలు మంజూరు చేసే విధంగా భారతి విద్యా రుణం అనే పథకాన్ని ప్రవేశపెట్టి మా బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున భారతి విద్యా రుణాన్ని అర్హులైన విద్యార్థులకు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. భారతి విద్యా రుణం అనే పథకం సంబంధించిన ఫైల్ పై చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మొదటి సంతకం చేశానని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులను గుర్తించి బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లో సభ్యులుగా చేర్పించి 75 వేల మంది సభ్యులు గల ఈ సంస్థని కనీసం రెండు లక్షల సభ్యులు అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు. తాను చైర్మన్ గా ప్రమాణస్వీకారం మహోత్సవమునకు వచ్చి నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.