సీఎంగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం
దివ్యాంగురాలు రజని నియామక పత్రంపై రెండో సంతకం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజని ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే : మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్. యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. చేయూత – రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000. ఇందిరమ్మ ఇళ్లు – ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.