ఎన్నికల ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్సార్ సిపి నేతలు
వెలగపూడి : తెలంగాణాలో ఓటు వేసిన వారిని తిరిగి ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయకుండా చూడాలని కోరుతూ వినతిపత్రం అందించారు. మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, జోగి రమేష్ , శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి,పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి మీనాను కలసి ఫిర్యాదు చేశారు. తెలంగాణాలో ఓటు వేసిన వారిని తిరిగి ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేయకుండా చూడాలని కోరుతూ వైయస్సార్ సిపి నేతలు ఏపి ఎన్నికల ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రం అందించారు. సచివాలయంలోని ఎన్నికల కమీషన్ కార్యాలయంలో రాష్ర్ట మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,జోగి రమేష్,శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, గోరంట్ల మాధవ్. మీనాను కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని అన్నారు. దేశంలోగాని, రాష్ర్టంలో గాని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా గా పెట్టుకుని పనిచేస్తున్నారని ఆరోపించారు. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుందని తెలిపారు.రాష్ర్టంలో డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతూ తనకున్న పచ్చమీడియా సహకారంతో దుష్ప్రచారానికి ఒడిగడుతుంటారని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.అయితే ప్రజలు చంద్రబాబు చెప్పేమాటలు నమ్మవద్దని కోరారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ హైదరాబాద్, ఏపీలో రెండుచోట్ల కలిపి 4 లక్షల 30 వేల 264 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు.ఆ డూప్లికేట్ ఓట్లకు సంబంధించి ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామని తెలియచేశారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీలు తొలగించాలని మీనాను కోరడం జరిగిందన్నారు. అర్హులైన వ్యక్తికి దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైయస్సార్ సీపీ విధానమని ఇదే అంశాన్ని తాము ఇప్పటికే పలుమార్లు ఎన్నికల కమీషన్ కు తెలియచేశామని వివరించారు. తాము అందించిన ఆధారాలను పరిశీలించి ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరామని అన్నారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతూ తిరిగి తానే వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారని అసలు చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.