అమరావతి : పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్ధిక సహకారం మంజూరు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని కోరారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆహారాధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే భీమా చేసిన రైతాంగం ఎంతమంది, లేనివారు ఎంతమంది అనే గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టక పోవడం వల్ల రైతాంగం ఆందోళన చెందే పరిస్ధితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని దగ్గుబాటి పురంధరేశ్వరి డిమాండ్ చేశారు.
[https://bloomtimes.org/images/srilekha_/Purandheshwari1.jpg]