విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చైర్మన్ దావులూరి తారక ప్రసాద్ రాష్ట్ర డిజిపి కే.రాజేంద్రనాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తారక ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వ, పోలీసు ఉద్యోగులు బాధ్యతాయుతంగా ఉంచేలా డిజిపి తగు చర్యలు తీసుకోవాలని ఈనెల 10వ తారీఖున మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. డి.జి.పి తారక ప్రసాద్ కి శుభాకాంక్షలు తెలిపారు.