కొవ్వూరు : విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగ్రామిగా నిలిపిన సంక్షేమాభివృద్ధి సారధి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం 160వ రోజు కొవ్వూరు మండలం దొమ్మేరు, పెనకనమెట్ట గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ నాయకులతో కలిసి హోంమంత్రి విస్తృతంగా పర్యటించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని కుటుంబ సభ్యులకు వివరించారు. గడప గడపకు కార్యక్రమంలో అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ.. హోంమంత్రికి హారతులతో ఆహ్వానాలు పలికారు. సోమవారం ఉదయం దొమ్మేరు లో జగనన్న లే అవుట్-1 లో ప్రారంభించగా రాత్రి పెనకనమెట్ట వరకూ కొనసాగించారు. పెనకనమెట్ట గ్రామంలో లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి గ్రామంలో గడప గడపకు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి హోం మంత్రి ప్రారంభించారు.