సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసిక బ్రాంతిలో ఉన్న పురందేశ్వరి
చంద్రబాబుపై లిక్కర్ స్కాం ఆధారాలు పురందేశ్వరి సీఐడీకి అందజేయాలి
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
విజయవాడ : ఎన్టీఆర్ పెద్ద కూతురిగా పుట్టి ఆయన్నే వెన్నుపోటు పొడిచి, ఆయన వ్యతిరేక కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అనుభవించి అనంతరం కాంగ్రెస్ క అధికారం దక్కదని బీజేపీలో చేరి, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి చేపట్టిన పురందేశ్వరి రాజకీయ రంగులు మార్చడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధ్యక్షుడైన తన మరిది చంద్రబాబు కోసం, అది కూడా తెలంగాణాలో కాంగ్రెస్ తో జతకట్టిన బావ సారూప్య పార్టీ (టీడీపీ) కోసం ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొమ్ముకాస్తున్నారని, ఇన్ని రంగులు మార్చగల ఆమె నైపుణ్యాన్ని ఏమని పిలవాలో తెలియడం లేదని అన్నారు.
బీజేపీలో ఎన్నాళ్లు ఉంటారో చెప్పగలరా పురందేశ్వరి? : ప్రస్తుత బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గతంలో టీడీపీలో ఎన్నాళ్లు ఉన్నారో, కాంగ్రెస్ కు ఎందుకు వెళ్లారో, కాంగ్రెస్ నుంచి బయటకు ఎందుకు వచ్చారో, బీజేపీలో ఎందుకు చేరారో అన్న ఏ ఒక్క ప్రశ్నకూ ఆమె వద్ద సమాధానం చెప్పలేకపోయారని, కనీసం ఇప్పుడున్న బీజేపీలో నైనా ఎంతకాలం ఉంటారో ధైర్యంగా చెప్పగలరా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసిక బ్రాంతిలో ఉన్న పురందేశ్వరి : పురందేశ్వరి సెలెక్టివ్ అటెన్షన్ అనే మానసిన బ్రాంతిలో ఉన్నట్లు అనిపిస్తోందని, తనకు కావాల్సిన వాటినే నమ్ముతున్నారని, కళ్లముందు వాస్తవం స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదని విజయసాయి రెడ్డి అన్నారు. ఆమె దృష్టంగా బావ సారూప్య పార్టీ, తన కుటుంబానికి మేలు చేయడం మీదనేనని అన్నారు. పచ్చ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిర్ధారించుకోకుండా రిపీట్ చేయడం సెలెక్టివ్ అటెన్షన్ లక్షణమేనని అన్నారు.
చంద్రబాబుపై లిక్కర్ స్కాం ఆధారాలు పురందేశ్వరి సీఐడీకి అందజేయాలి : చంద్రబాబు ఏ-3గా కేసు నమోదైన లిక్కర్ స్కాంపై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురందేశ్వరి దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో తమపై బురద జల్లడం సరికాదని అన్నారు. వాస్తవాలు బయటపడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలని అన్నారు.
దీనమైన స్థితిలో టీడీపీ : అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ విధానాన్ని జెండా పీకేయడం అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీలో కూడా మిత్రపక్షాలకు సీట్లు పంచాల్సి ఉండడంతో టీడీపీ 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి కనిపిన్నారు.