దేశంలో ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం మన రాష్ట్రం చేపట్టాం
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సందర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి
విజయవాడ : స్థానిక పశ్చిమ నియోజకవర్గంలోని 35,37,38,41,48 డివిజన్లలో 5 సచివాలయలలో పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. అనంతరం వైద్యం చేయించుకున్న ప్రజలకు మందులు పంపిణీ చేసి వైద్య పరీక్షలు ఏ రకంగా చేస్తున్నారో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ సచివాలయల పరిదిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సందర్శించడం జరిగిందన్నారు. ప్రతి రోజూ సచివాలయం పరిదిలో ఉన్న అందరికీ వైద్యం అందిస్తున్నారు. అధికారులు డాక్టర్లు సమన్వయంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ క్యాంపులు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో ప్రతి రోజు వేలాది మంది ప్రజలకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వైద్యం చేసి మందులు కూడా ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం మన రాష్ట్రం చేపట్టాం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.గతంలో బీజేపీ వాళ్ళు మద్యం స్కీమ్ పెడతానన్నారు ఒకసారి గుర్తుచేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు మద్యం మీద ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజల మీద లేదన్నారు. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పురంధేశ్వరి చదువుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పురంధేశ్వరి కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన బాగ్యలక్ష్మి ,ఆయా డివిజన్ల కార్పొరేటర్లు మండేపూడి చటర్జీ,షేక్ రెహముతున్నిసా,ఎండి ఇర్ఫాన్, ఆత్తులురి ఆదిలక్ష్మి, పెద్దబాబు, పోలిమెట్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.