విజయవాడ : స్థానిక భవాని పురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావును సోమవారం పలువురు నగరాల సంఘం నాయకులు సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్న నగరాలను బీసీ-డి లుగా పరిగణించేందుకు రాష్ట్ర ప్రభ్యుత్వం జిఓ జారీ చేయడం సంతోష దాయకమన్నారు.అన్ని జిల్లాలో ఉన్న నగరాలను బీసీ-డి చేర్చేందుకు అవిశ్రాంత కృషి చేసిన వెలంపల్లి శ్రీవాసరావుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి కి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎన్ వి రావు, పిళ్ళా రవి, శీరం వెంకట్రావు, మజ్జి శ్రీనివాస రావు, బాయన శేఖర్ బాబు, రాంపిళ్ల వాసు, నాగోతి శ్రీనివాసరావు, కొరగంజి చక్రవర్తి, ఇద్దిపిల్లి పవన్, పొట్నూరి శివ నాగేశ్వరరావు, అడ్డురి రాము, నాగోతి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.