టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
అమరావతి : కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్గోపాల్పై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విజయ్ గోపాల్ను చెప్పులతో కొట్టిన వైసీపీ సైకోలను అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పాలక పార్టీ నేతలు ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని లోకేశ్ నిలదీశారు. బాధితులపైనే రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.