అనకాపల్లి : గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని, సీఎం జగన్ పాలనలో ఆయా వర్గాలకు పెద్ద పీట వేశారని వైఎస్సార్సీపీ కీలక నేతలు అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ సామాజిక చైతన్యయాత్ర సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మళ్ళీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. దివంగత నేత వైఎస్ పేదల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తే వైఎస్ జగన్ పది అడుగులు ముందుకు వేశారు. టీడీపీ పాలనలో బడుగు బలహీనవర్గాలకు ఎలాంటి గుర్తింపు లేదు. సీఎం జగన్ పాలనలో మాత్రం బడుగు బలహీవర్గాలకు పెద్ద పీట వేశారన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ బడుగు బలహీవర్గాలకు సుమారు లక్ష 50 కోట్ల రూపాయల్ని వాళ్ల వాళ్ల ఖాతాల్లో నేరుగా జమ చేసింది ఈ ప్రభుత్వం. సీఎం జగన్ విజనరీ నాయకుడు. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదవాళ్ల జీవితాలకు అండగా నిలిచారు. తండ్రి బాటలోనే పయనిస్తూ పాలన చేస్తున్నారు. ప్రజల హృదయాల్లో సీఎం జగన్ ఉన్నారు. అంతకు ముందు మంత్రి గుడివాడ అమర్నాథ్ సారథ్యంలో సామాజిక సాధికార యాత్ర ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకుంది. భారీగా జనం హాజరు కాగా డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ సత్యవతి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డిటి ప్రసాద్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, అదీప్ రాజు, ఉమా శంకర్ గణేష్ పాల్గొన్నారు.