బోధన్ : దేశమంతా గులాబీ హవా నడుస్తున్నదని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజక వర్గంలో గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ సందర్భంగా బోధన్ పట్టణంలో తీసిన ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. షకీల్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుతం దేశమంతటా గులాబీ హవా నడుస్తున్నదని, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే విజయమని అన్నారు. షకీల్ నామినేషన్ ర్యాలీని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీలా అనిపిస్తున్నదని ఆమె అభివర్ణించారు. ఈ జోష్ షకీల్ విజయం ఖాయమని చెబుతోందని అన్నారు.