ఆమె అందాన్ని చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. అలాంటి అందానికి అభినయం తోడైతే.. ఆమె పేరే ఐశ్వర్య రాయ్. తన అందంతో.. నటనతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన గొప్పనటి. మోడల్‌గా కెరియర్ ను ప్రారంభించి.. మిస్ వరల్డ్‌గా ఎంపికై.. అటునుంచి.. భారతీయ వెండితెరపై వెలుగులు నింపింది. ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆమె అందానికి కోట్లాది అభిమానులున్నారు. తాజాగా ఆమె నవంబరు ఒకటో తేదీన తన జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు.
జన్మదినం రోజు గణేశుని ఆశీస్సులు పొందేందుకు ఆమె తన కుమార్తెతో కలిసి సిద్ధివినాయక ఆలయానికి వెళ్లారు. తెల్లటి కుర్తీ, నీలిరంగు డెనిమ్‌లో తల్లి, కుమార్తెలు అద్భుతంగా కనిపించారు.
ఐశ్వర్య భర్త అభిషేక్, తన భార్య పుట్టినరోజుకు ముందుగా బ్లాక్ అండ్ వైట్‌లో ఆమె పాత ఫోటోను షేర్ చేస్తూ, “హ్యాపీ బర్త్‌డే, వైఫ్డీ! అంటూ “ప్రేమ, కాంతి, ప్రశాంతత, శాశ్వతమైన విజయం” అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చాడు.