పుంగనూరులో దళితనేతపై చిత్రహింసలు హేయనీయం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమరావతి : పుంగనూరులో దళితనేతపై చిత్రహింసలు హేయనీయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యహింసను ఆపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంలా మారిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి పుంగనూరు నియోజక వర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారన్నారు.
ఎలాంటి కేసులేని టీడీపీ దళిత నేత, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించడమే గాక చేతులు వెనక్కికట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేయడం తాలిబాన్ రాజ్యాన్ని గుర్తుకు తెస్తోంది. ముఖ్యమంత్రి జగన్రెడ్డి బహిరంగ వేదికలపై నా ఎస్సీ, ఎస్టీ, బీసీలపై లేని ప్రేమలు ఒలకబోస్తుంటే వాస్తవంలో ఆయావర్గాలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా దారుణాలు కొనసాగుతున్నాయి. టీడీపీ దళిత నేతను అక్రమంగా నిర్బంధించి దాడిచేసిన కల్లూరు సీఐపై ఏపీ డీజీపీ తక్షణమే విచారణ జరిపి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న రాజ్యహింసను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
దళితులపై జరుగుతున్న రాజ్యహింసను నిలువరించాలి: ఏపీలో పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంలా మారిపోయి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రత్యేకించి పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఎటువంటి కేసులేని టీడీపీ దళిత నేత ముల్లంగి వెంకటరమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు వెనక్కి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేయడం తాలిబన్ల రాజ్యాన్ని గుర్తుకు తెస్తున్నారన్నారు.
చేతులు వెనక్కి కట్టి..నోట్లో గుడ్డలు కుక్కి : ముఖ్యమంత్రి జగన్ బహిరంగ వేదికలపై ఎస్సీ, ఎస్టీ, బీసీలపై లేని ప్రేమలు ఒలకబోస్తున్నారని, కానీ ఆయా వర్గాలపై ఇదివరకు ఎన్నడూ లేనంతగా దారుణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. టీడీపీ దళిత నేతను అక్రమంగా నిర్బంధించి దాడి చేసిన కల్లూరు సీఐపై రాష్ట్ర డీజీపీ తక్షణమే విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న రాజ్యహింసను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నారా లోకేశ్ కోరారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/nara%20lokesh.jpg]