అమరావతి : కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలారెడ్డి మద్దతివ్వడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టారో ఆ పార్టీతో షర్మిల కలిశారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం. మాకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసు. జగన్పై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది. చంద్రబాబుపై ఎందుకు తక్కువ కేసులు పెట్టారని అడగాలి. ఇసుకలో ఉచితంగా మార్కెట్లో లోడింగ్, ట్రాన్స్పోర్ట్ మీద మాత్రమే దొరికిందా చెప్పాలి. ఉచితంగా అంటే క్రేన్ లు , బోట్లతో ఎవరు తోడారు. ఎన్జీటీ ఎందుకు ఫైన్ విధించింది. మద్యంలో కూడా ప్రివిలేజ్ కేస్ వేసి తర్వాత దాన్ని తీసేస్తారు. ఈ వ్యవహారంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేస్ పెట్టారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కేవలం చంద్రబాబు ఫ్యామిలీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె కూడా వారం పది రోజుల నుంచే ఇలా మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.