చిత్తూరు : వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడారు. సొమ్ము కేంద్రానిది సోకులు జగన్ ప్రభుత్వానిది అన్న చందంగా పాలన సాగుతోంది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం ప్రభుత్వం చొరవతో చేపట్టిన జాతీయ రహదారులు మినహా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చిత్తూరు విజయ సహకార పాలడైరీని 99 ఏళ్లకు అమూల్ సంస్థకు అప్పగించడం దారుణం. చిత్తూరు సహకార చక్కర ఫ్యాక్టరీని తెరపించక పోగా ఆస్తులను అమ్మేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధం కావడం బాధాకరం. పండ్ల పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం సిండికేట్ అయి మామిడి రైతులను దోచుకుంటుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి పంపాల్సిన అవసరం ప్రజలపై ఉందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.