వెలగపూడి సచివాలయం : సమాజంలోని అవినీతి నిర్మూలనపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ, విజిలెన్సు కమీషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో విజిలెన్సు అవేర్నెస్ వీక్-2023, రివైజ్డ్ విజిలెన్స్ మాన్యూల్ పై కార్యశాల జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిఎస్ ముందుగా విజిలెన్సు మాన్యూల్ ను విడుదల చేయడంతో పాటు హేండ్ బుక్ ను ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర విజిలెన్సు కమీషన్ ప్రతి ఏటా అక్టోబరు 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నవంబరు 5 వరకూ వారం రోజులపాటు విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని దానిలో భాగంగా ఈఏడాది ‘Say no to Corruption,Commit to the Nation’ అనే నినాదంతో విజిలెన్సు అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నారననారు.ఈవారోత్సవాలు అవినీతి నిరోధంపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. సమాజంలో అవినీతి నిరోధానికి పూర్తి స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని ఆదిశగా ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ,విజిలెన్సు కమీషన్ ఆధ్వర్యంలో సమాజంలోని పౌరలు,విద్యార్ధులు తదితరులకు సెమినార్లు,వర్కుషాపుల ద్వారా పెద్దఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహిస్తోందని సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విజిలెన్సు కమీషన్ కాంప్రహెన్సివ్ విజిలెన్సు మాన్యూల్ ద్వితీయ ఎడిషన్ ను తీసుకురావడం అభినందనీయమని ఇది విజిలెన్సు ఎన్పోర్సుమ్మెంట్ చేసే దర్యాప్తు సంస్థలకు ఎంత గానో ఉపయోగపడుతుందని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈమాన్యూల్ లో విజిలెన్సు అంశాలకు సంబంధించి నవీకరించిన చట్టాలు, నిబంధనలు, రెగ్యూలేషన్స్, సర్కులర్ ఆదేశాల తోపాటు సర్వోన్నత న్యాయస్థానం,పలు ఉన్నత న్యాయస్థానాలు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వెలువరించిన వివిధ లాండ్ మార్క్ జడ్జిమెంట్లు పొందుపర్చారని పేర్కొన్నారు. అంతేగాక వివిధ విజిలెన్సు ఫంక్సనరీలు వారి విధులను మరింత సమర్ధ వంతంగా నిర్వహించేందుకు ఈమాన్యూల్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.అదే విధంగా విజిలెన్సు కమీషన తీసుకువచ్చిన హేండ్ బుక్ ఆన్ డిసిప్లైనరీ ప్రొసీడింగ్స్ కూడా డిసిప్లైనరీ అధారిటీలు, ఇంక్వరీ అధారిటీలు , ప్రెజెంటింగ్ అధికారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. వివిధ డిసిప్లైనరీ ప్రోసీడింగ్స్ పై ప్రభుత్వం జారీ చేసిన చట్టాలు,నిబంధనలు,ఈకేసులకు సంబంధించిన ఫిర్యాదుల నిర్వహణ,పెనాల్టీలు,వివిధ కోర్టు ఆర్డర్లు ఇందులో పొందుపర్చబడ్డాయని సిఎస్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో విజిలెన్సు అవగాహనకు సంబంధించి వివిధ శాఖల్లో విజిలెన్సు కేసులపై శాఖాధికారులు, కార్యదర్శుల స్థాయిలో సమీక్షించడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా వివిధ విజిలెన్సు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్లు దాఖలు ఇతర అంశాలపై చర్యలు తీసుకునేలా జిపిలు,ఇతర స్టాండింగ్ కౌన్సిళ్ళతో సమీక్షిస్తున్నట్టు తెలిపారు.అంతేగాక సర్వీసు డెలివరీ విషయంలో సాధ్యమైనంత వరకూ మానవ డిస్క్రిషన్ ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.ఎపిహెచ్ఆర్డిఐ ద్వారా విజిలెన్సు ఫంక్షనరీలకు కెపాసిటీ బిల్డింగ్ పై మరిన్నిశిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిజిపి కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖల్లో అవీనీతి నిర్మూలనపై అవగాహన కల్గించేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు.ఇటీవల కాలంలో ప్రజల్లో కూడా అవినీతి నిర్మూలనపై పెద్దఎత్తున అవగాహన వచ్చిందని చెప్పారు. ఎసిబి సమాజంలో అవినీతి నిర్మూనలకు తనవంతు కృషి చేస్తోందని,ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలకు కృషి చేయాల్సిన అవసరం ఉందని డిజిపి పేర్కొన్నారు.అవినీతికి సంబంధించిన వివిధ పెండింగ్ ట్రైల్ కేసుల సత్వర పరిష్కారానికి ఎసిబి పెద్దఎత్తున కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ఎపిహెచ్ఆర్డిఐ డైరెక్టర జనరల్ ఆర్పి సిసోడియా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎపి విజిలెన్సు కమీషన్ చాలా చురుగ్గా పని చేస్తోందని కొనియాడారు.సమాజంలో అవినీతికి గల మూల కారణాలను తెలుసుకుని ఆదిశగా అవినీతి నిర్మూలకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.అలాగే ప్రజల్లో కూడా దీనిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ముఖ్యంగా స్ట్రక్చరల్ కరప్సన్,ఇనిస్టిట్యూషనల్ కరప్సన్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్పోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారా అవినీతి నిర్మూలకు కృషి చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ నిర్దేశిత విధులను సక్రమంగా నిర్వహించాలని లేకుంటే అది కూడా నిజాయితీ లేమికి దారితీస్తుందని పేర్కొన్నారు.
తొలుత ఈవిజిలెన్సు అవగాహనా వారోత్సవాలకు స్వాగతోపన్యాసం చేసిన రాష్ట్ర విజిలెన్సు కమీషనర్ వీణా ఈశ్ మాట్లాడుతూ 2003లో తెలిసారిగా విజిలెన్సు మాన్యూల్ తొలి ఎడిషన్ తీసుకురాగా మరలా ఇప్పుడు రివైజ్డ్ మాన్యూల్ ను తీసుకువచ్చామని చెప్పారు.వివిధ విజిలెన్సు కేసులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో హైపవర్ కమిటీని పునర్ వ్యవస్థీకరించడం జరిగిందని అన్నారు. ఈకమీటి ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి వివిధ అంతర్ శాఖల సమన్వయంతో సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎసిబికి సంబంధించి సుమారు 1600 వరకూ పెండింగ్ కేసులు ఉన్నట్టు చెప్పారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ ద్వారా సాక్షుల విచారణ చేపట్టామని ప్రస్తుతం కూడా అవసరమైన సందర్భంలో ఈవిధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. కోర్టులు కూడా విజిలెన్సు కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అవినీతి నిర్మూలకు కృషి చేస్తున్న ఎసిబిని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. అదే విధంగా కంప్లైంట్ హేండ్లింగ్ విధానాన్ని కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని వీణా ఈశ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తొలుత ఎసిబి అదనపు డిజి పిహెచ్డి రామకృష్ణ స్వాగతం పలకగా ఇంకా ఈసదస్సులో ఎసిబి జెడి అదాన్ నయూమ్ అస్మి,విజిలెన్సు అండ్ ఎసిబికి సంబంధించి జె.సత్యనారాయణ తదితర పోలీస్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు తదతరులు పాల్గొన్నారు.