అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సీఐడీ పిటిషన్పై బుధవారం వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది.
[https://bloomtimes.org/images/Hemalatha_/High%20court.1.jpg]
[https://bloomtimes.org/images/Hemalatha_/High%20court.1.jpg]