వెలగపూడి సచివాలయంలో కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ భేటీ ప్రారంభమైంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు, రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుందని తెలుస్తోంది.సమగ్ర కుల గణనకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీపై కేబినెట్ చర్చించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ ప్రభుత్వం నెరవేర్చనుంది.