పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి వెలంపల్లి
గతంలో డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలేశారు
ఎంపీ కేశినేని కి పశ్చిమ నియోజకవర్గ గుర్తుందా
విజయవాడ : స్థానిక 48వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలను గురువారం మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం 72లక్షల 6 వేల రూపాయల నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ కొండా ప్రాంతం అంతా పర్యటించడం జరిగిందన్నారు.అన్ని రోడ్లు మెట్లు వేసినట్లు తెలిపారు.మూడు వాటర్ ట్యాంకులు వున్నాయన్నారు.పై ప్రాంతం వరకు మెట్లు వేశమన్నారు.పాడుపడిన బావి ఒకటి ఉందని దానిపై బిల్డింగ్ నిర్మించడం జరుగుతుందన్నారు.బ్రహ్మం గారి మఠం వద్ద కళ్యాణ్ మండపం నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ డివిజన్ గతంలో అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారుటీడీపీ ఎంపీ కేశినేని ఈ డివిజన్ పై దృష్టి కరువు అని అన్నారు.అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు.బూస్టర్ కూడా అభివృద్ది చేశాం అని తెలిపారు.డివిజన్ అభివృద్ది కృషి చేస్తాం అని తెలిపారు.దొంగా బయటకు వస్తే ఏమి ఆదరణ వస్తుందన్నారు.చంద్రబాబు ఒక దొంగా ప్రజల డబ్బులు దోచేసేసాడు అని తెలిపారు.40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు సింపతీ కోసం ఒక గేము ఆడుతున్నాడన్నారు.ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు అని అన్నారు.నాకు అనేక వ్యాధులు ఉన్నాయి అని కోర్టును కోరితే కోర్టు వారు బెయిల్ ఇచ్చాడన్నారు.టీడీపీ కి బయటపడే పరిస్థితి లేదన్నారు.ప్రజల గుండెలలో ఉండే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.ప్రజల ఇళ్లలో ఉన్న పార్టీ వైకాపా అని తెలిపారు.లోకేష్ వల్ల కాక పురంధేశ్వరి బయటకు వచ్చి చంద్రబాబు కోసం పని చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అత్తులురి ఆదిలక్ష్మి పెద్దబాబు,పిళ్ల సూరిబాబు(జగ్గు),అయితా కిషోర్,వెంకటలక్ష్మీ,వరలక్ష్మి, శిరం వెంకటరావు, అమరనాథ్, గురువులు, దుక్క దుర్గారావు,భాస్కర్,శివ పట్నాయక్,గాలి నాగరాజు, వానపల్లి త్రిమూర్తులు, జాని, ముస్తఫా,విమల, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు పాల్గొన్నారు.