అమరావతి : ఇసుక విషయంలో పాలకులు ఏవిధంగా జేబులు నింపుకుంటున్నారన్న విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియకు వివరించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇసుక వ్యవహారాన్ని లేవనెత్తి గణాంకాలతో సహా ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తూ ఇసుక వ్యవహరంలో నైనా ప్రభుత్వం సమాధానం చెబుతుందా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనంతమైన సహజవనరులు ఉన్న రత్నగర్భ ,నదీ నదాలు ఓడరేవులు సువిశాలమైన సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. భవన నిర్మాణానికి కావలసిన ఇసుక వనరులు పుష్కలంగా ఉన్నాయి ఒకప్పుడు డ్వాక్రా మహిళలు ఇసుక సరఫరాను నియంత్రించారు తదుపరి ఉచితంగా ఇసుకను తీసుకుని వెళ్లే ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇసుకను వ్యాపారంగా మార్చిందని పురందేశ్వరి ఆరోపించారు. ఈ సందర్భంగా ఇసుక తవ్వకాల్లో నిభందనలకు పాతర వేసిన విషయాన్ని ఫొటోలు ద్వారా మీడియాకు ఆధారాలు చూపిస్తు వైసీపి ప్రభుత్వం వ్యవహారం పై తీవ్రస్ధాయిలో మండి పడ్డారు. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు పలికేది అందులో ఎక్కువ భాగం ట్రాక్టర్ ఎగుమతి, దిగుమతి ఛార్జీలు ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక అయిదు నుండి ఆరువేల రూపాయలు ధర పలుకుతోంది.
ఇసుక ధరతో భవన నిర్మాణ వ్యయం గోరంత ఉండాల్సింది కొండంతగా మారింది. ఫలితంగా బడుగులు , మద్యతరగతి వారు నిర్మాణాలను గత్యంతర లేక నిలిపి వేశారు ఈ కారణంగా 35 నుండి 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్డున పడ్డాయి. దీనికి 2021 మే3వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీ ని తీసుకుని వచ్చింది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించారు. ఈ మూడు జోన్లలో లభ్యమయ్యే ఇసుక తవ్వకాలను ఢిల్లీ కి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్ అనే గుత్తేదారునికి హక్కులు కల్పించారు . ఈవిషయంలో ఎవ్వరినీ ఇందులో పోటీ దారు లేకుండా చేసి కేవలం సంవత్సరానికి 760 కోట్లు చెల్లించే షరతు పై వప్పందం ప్రభుత్వం చేసుకుంది.
ఈ వప్పందంలో గుత్తేదారుడు ఎవ్వరికీ సబ్ లీజ్ కు ఇవ్వకూడదు అనే నిభందన ఉంది అయితే ఈ నిభందనను ఉల్లంఘించి విజయవాడ కు చెందిన టర్న్ కీ ఎంటర్ ప్రైజస్ కు సబ్ లీజ్ ఇచ్చారు. దీని వల్ల ఏడాదికి 188 కోట్లు ఆదాయం వసూలు జరుగుతుండగా మూడోవ వంతు అనగా 63 కోట్లు వరకు ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. మిగితా 120 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి జమఅవుతోంది. అంటే 16 మాసాల్లో 2000 కోట్లు ఇసుకను మేసేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని జూబ్లిహిల్స్ నివాసి సుధాకర్ రెడ్డి నడిపించారు ఈ వ్యక్తికి ఒక ఐఎఎస్ అదికారి సహకరించినట్లుగా మాకు సమాచారం ఉంది. వాస్తవానికి ఈ ఇసుక తవ్వకానికి ఆయా జిల్లాల్లోని కలెక్టర్, మైనింగ్ ఎడిల సంయుక్త ఆధ్వర్యంలో అనుమతులుతో జరగాలి కాని ఇసుక గుత్తేదారుడు కు చెందిన గుమస్తా ఈ విషయంలో కీలక పాత్రవహిస్తున్నాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం భారీ యంత్రాలతో తవ్వకాలు చేయకూడదు, నదీ గర్భంలో డ్రెడ్జింగ్ నిర్వహించ కూడదు, వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిపి వేయాలి ఈ విధంగా ఉన్న అనేక నిభందనలకు పాతర వేసి యధేచ్చగా ఇసుక తవ్వకాలు నిర్వహించారు ఇదే విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక నోటీసు ఇచ్చి ఫైన్ విధిస్తే ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిన విషయాన్ని పురందేశ్వరి ప్రస్తావించారు.
రహదారులు పక్కన కూడా ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. అలాగే 20 హెక్టార్ల పైన భుభాగంలో ఇసుక తవ్వకాలను బి1. కేటగిరి గాను, అయిదు హెక్టార్ల లోపు ఉన్న తవ్వకాలను బి2 కేటగిరి గాను ప్రభుత్వం పేర్కొని ఇసుక తవ్వకాలకు నిభందనలు పెట్టింది. గ్రీన్ ట్రిబ్యునల్ వారి నియమావళిని ఉల్లంఘించి తవ్వకాలను ఇష్టానుసారంగా సాగిస్తున్నారు.
ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న శక్తుల అరాచకాలను, దోపిడీలను వేలెత్తి చూపడమే కాక ప్రజలను చైతన్య పర్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రజావాణిని నడుంభిగించింది. ఈ ఆగడాలు ఆగే వరకు పోరాటం స్ధాయి పెరుగుతుందని హెచ్చరించారు. గ్రామపంచాయితీ నిధులు విషయంలో పొరాటం చేసాం అదేవిధంగా మద్యం తయారీ మాఫియా పై ఉద్యమం చేసాం అనే విషయాలను ప్రస్తావిస్తూ అధికార పక్షం కౌంటర్లకు జడిసే ప్రశ్న ఉత్పన్నం కాదన్న విషయాన్ని మీడియా ముందు బిగ్గర స్వరంతో పురందేశ్వరి స్పష్టంచేశారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/purandheshwari.jpg]