విజయవాడ : పేదల ఆరోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గిరిపురంలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాల నందు బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఎంహెచ్ఓ సుహాసిని, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్, డిప్యూటీ డీఎంఓహెచ్ ఇందుమతితో కలిసి ఆయన పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పేదల ఆరోగ్యానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలున్న వారికి నయమయ్యే వరకు తోడుగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పుకొచ్చారు. 24వ డివిజన్లోని 92 వ వార్డు సచివాలయ పరిధిలో 958 గృహాలను ఇంటింటీ సర్వే ద్వారా ఆరోగ్య సిబ్బంది సందర్శించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 2,685 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 506 మందికి టోకెన్లు అందజేసినట్లు వెల్లడించారు. వీరందరికీ 5 దశల్లో ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడంతో పాటు వ్యాధి నయం అయ్యేంతవరకు సరిపడా మందులు పూర్తి ఉచితంగా అందించడం జరుగుతోందన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలందరి హక్కుగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలోనూ వారానికి రెండు రోజులు సోమ, గురు వారాల్లో ఉదయం 8 గంటలలోపు షుగర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. కనుక ఆరోగ్యం విషయంలో అలసత్వం, ఆలస్యం తగదని.. ఏ మాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా వెనకడుగు వేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు, ఆరోగ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యరంగంలో సరికొత్త ఒరవడి జగనన్న ఆరోగ్య సురక్ష : జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య రంగంలో సరికొత్త ఒరవడి అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రామకృష్ణాపురంలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఎంహెచ్ఓ సుహాసిని, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన వారితో మాట్లాడి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులను సైతం పరిష్కరించే దిశగా అనుభవం ఉన్న వైద్యులతో ప్రజలకు చికిత్స అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తిస్థాయిలో అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 6,729 మంది ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగపరచుకోగా.. వీరందరికీ 5,824 టెస్టులు, 2,021 మందికి కంటి పరీక్షలు, 715 మందికి ఈసీజీ టెస్టులు నిర్వహించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీరిలో 715 మందిని మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 30వ డివిజన్లోని 246 వ వార్డు సచివాలయ పరిధిలో 1,243 గృహాలను ఇంటింటీ సర్వే ద్వారా ఆరోగ్య సిబ్బంది సందర్శించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 3,064 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 550 మందికి టోకెన్లు అందజేసినట్లు వెల్లడించారు. మరోవైపు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వ్యవస్థ పట్ల ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుదారుల సౌలభ్యం కోసం ఓ మొబైల్ యాప్ ను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అర్థరాత్రి వేళల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు సద్వినియోగపరచుకునేలా.. ముగ్గురు పర్యవేక్షకులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిందని మల్లాది విష్ణు అన్నారు. అలాగే రామకృష్ణాపురం ప్రజలకు మూడు వైపులా దేవీనగర్, అయోధ్యనగర్, ఇందిరానాయక్ నగర్లో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించుకున్నట్లు తెలియజేశారు. ఈ సేవలన్నింటినీ సద్వినియోగపరచుకుని ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు, ఆరోగ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.