తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం
చంద్రబాబు దాఖలుచేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో విచారణ
సుప్రీంకోర్టు తదుపరి విచారణ నవంబర్ 8కి వాయిదా
న్యూఢిల్లీ : ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లాయర్ సిద్ధార్థ లూథ్రా అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన అండర్ టేకింగ్ కొనసాగించాలని ఆదేశించింది.
ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలుచేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. తొలుత సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయిందని తెలిపారు. ఫైబర్‌నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదిస్తూ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోందని, ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపామని చెప్పారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది రీత్యా నవంబర్ 9న విచారణ చేపట్టాలని సిద్ధార్థ లూథ్రా కోరగా రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని, ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఫైబర్‌నెట్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయ్యాక చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా ఒక దానిపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసిందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో విచారణను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రభుత్వ లాయర్ స్పందిస్తూ కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి అరెస్టు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పారు. ఆ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని తాము దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లోనూ పేర్కొన్నట్లు వివరించారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పైబర్ నెట్ కేసులో మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు చంద్రబాబు పిటిషన్ ను మాత్రం తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారణకు రాగా జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.