విజయవాడ : దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఇంద్రకీలాద్రిపై శ్రీ మహా చండీ దేవి అలంకారంతో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు అంతరాలయ దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.