గురువారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి చట్ట సవరణ సలహా కమిటీ సమావేశం చైర్మన్ మరియు ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) రాజన్న దొర పీడిక అద్యక్షతన జరిగింది. ఈ కమిటీ సభ్యులైన రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, పార్లమెంట్ సభ్యులు డా.మద్దిల గురుమూర్తి, శాసన మండలి సభ్యులు డా. మొండితోక అరుణ్ కుమార్, శాసన సభ్యులు కంబాల జోగులు, డా. మొండితోక జగన్మోహనరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కంపొనెంట్ చట్టం-2023 సవరణకు పరిగణలోకి తీసుకోవాల్సిన పలు అంశాలపై సుదీర్ఝంగా చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అమలు పరుస్తున్న ఎస్సీ, ఎస్టీ చట్టాలను పరిశీలించేందుకు ఆయా రాష్ట్రాల్లో పర్యటించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఒక వర్కు షాపును నిర్వహించి పలు వర్గాల నుండి సూచనలు సలహాలను స్వీకరించి, వాటి పరిశీలన అనంతరం చట్టానకి చేయవలసిన సవరణపై నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.
రాష్ట్ర స్థాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ జి.జయలక్ష్మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇతర రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, చట్టాల్లోని పలు అనుకూల అంశాలను రాష్ట్ర చట్టంలోని అంశాలతో పోల్చుతూ సభ్యులకు వివరించారు. అదే విధంగా ఒక ప్రభుత్వేతర సంస్థ అందజేసిన సూచనలు, సలహాలను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమె సభ్యులకు వివరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు విజయకృష్ణన్ తో పాటు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.