జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ : ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, నిరసన తెలిపే హక్కును కూడా హరిస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గురువారం జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌కు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు అందజేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరు, అనవసరంగా నమోదు చేస్తున్న కేసులను ఆయన నివేదించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలను నిర్బంధిస్తున్న తీరుపై వివరాలను కనకమేడల రవీంద్రకుమార్ అందజేశారు.