అదేవిధంగా శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల మోహినీ అవతార నృత్య ప్రదర్శన భక్తులను సమ్మోహనపరిచింది. రాజమండ్రికి చెందిన దుర్గా నాగమణి బృందం చేసిన డప్పు నృత్యం కనువిందు చేసింది. హైదరాబాదుకు చెందిన అభిరామి బృందం ఒడిస్సీ నృత్యంతో అలరించారు. తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంతానికి చెందిన రాహుల్ బృందం కావడి నృత్యాన్ని ప్రదర్శించారు. రాజమండ్రికి చెందిన పి.సుమన్ డ్రమ్స్ విన్యాసాలతో ముగ్ధులను చేశారు. కొత్తగూడెంకు చెందిన పి.వాసు బృందం కోలాటాలతో అలరించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పి.రవితేజ బృందం గోపిక కృష్ణుడు వేషధారణతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. కర్నాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా, కంప్లికి చెందిన కె. కృష్ణ బృందం కొంబు కహాలే అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. బెంగళూరు విద్యారణ్యపురికి చెందిన ఎస్.దివ్యశ్రీ సంకీర్తన కుసుమాంజలితో అలరించారు. తిరుమల బాలాజీ నగర్ కు చెందిన డి.శ్రీనివాసులు బృందం కోలాటాలతో అలరించారు. టీటీడీ జెఈవో సదా భార్గవి ఆదేశాల మేరకు ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి రాజగోపాల్, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.