సారవకోట : జగనన్న ప్రజా ఆరోగ్య సంక్షేమానికై ప్రతి ఇంటింటికి వైద్య సేవలు అందించే బృహత్తరమైన కార్యక్రమమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమని దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పార్టీ అధ్యక్షులు , నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు . సోమవారం సారవకోట మండలం చిన్నగుజ్జువాడ గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపడుతూ ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధనే మన జగనన్న ప్రభుత్వ సంకల్పమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిని జల్లెడపట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను ఆరోగ్య సిబ్బంది తెలుసుకుని జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా వైద్యం, పరీక్షలు, మందులు ఇప్పించే మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సారవకోట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.