నెల్లూరు : 2024 ఎన్నికల్లో పొరపాటున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంటుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్చార్జి , ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని వైయస్సార్ నగర్ 30 డివిజన్లో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమాన ప్రాతిపదికన పరుగులు తీస్తున్నాయని ఎంపీ ఆదాల వ్యాఖ్యానించారు. వైయస్సార్ నగర ప్రాంతానికి మరో కోటిన్నర నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎంపీ ప్రజలకు సూచించారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో చర్చించి అత్యధిక నిధులను తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.