రాజమహేంద్రవరం : పనికిమాలిన చెత్త సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేవలం ప్రభుత్వ సంపాదన దోచుకోవటమే తెలిసిన వ్యక్తి సజ్జల రామకృష్ణా రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసమే భయపడుతున్నామన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ను లక్షలాది మంది మహిళలతో ముట్టడిస్తామని అన్నారు. రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రత ఉందని తెలిపారు. జగన్ తప్పుడు ప్రచారం ఆపాలని, జగన్ తిన్న సొమ్మంతా కక్కిస్తామన్నారు. జగన్ తాత, చెల్లి షర్మిళ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు కోసం జగన్ మాట్లాడటం సిగ్గు చేటని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు.