రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు అధికారులు స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కోసం స్నేహ బ్యారక్ కేటాయించాం. ఆయన బయటకు వచ్చేటప్పుడు ఏ ఖైదీ ఉండరు. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆయన ఆరోగ్యం కోసం ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉన్నారు. రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. జైల్లో పూర్తి వైద్య సహాయం అందుతోంది. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు బరువు 66 కేజీలు ఉంటే ప్రస్తుతం ఆయన బరువు 67 కేజీలు. ఒంటిపై దద్దుర్లు ఎక్కువగా ఉండటంతో జీజీహెచ్ డాక్టర్లను సంప్రదించి జైల్లో వైద్యం చేశాం. చంద్రబాబు ఎప్పుడూ వాడే మందులే వాడుతున్నారు. జైలుకు వచ్చిన తర్వాత మందులు మారలేదన్నారు.