న్యూఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్కు రఘురామ లేఖ రాశారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని, ఐదు కిలోల బరువు తగ్గారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మరింత బరువు తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. హానికరమైన స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నాయన్నారు. ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని గవర్నర్ను కోరారు. చంద్రబాబుకు వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.