చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉంది
కోర్టుకూడా నమ్మే చంద్రబాబును జైలుకు పంపించింది
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు : చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని మండిపడ్డారు. సీమెన్స్ సంస్థ సైతం మాకు సంబంధం లేదని చెప్పిందని తెలిపారు.రూ. 300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు. అన్ని ఆధారలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఫేక్ ఇన్వాయిస్తో నిధులు పక్కదారి పట్టించారు. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. ఈడీ కూడా నలుగురిని అరెస్ట్ చేసింది. రూ. 300 కోట్లు జేబులో వేసుకోవడానికే స్కిల్ కుట్ర. ఈ స్కామ్‌కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే. చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉంది.
కోర్టుకూడా నమ్మే చంద్రబాబును జైలుకు పంపించింది. వాళ్ల లాయర్లు కూడా ఒకే పాయింట్ మీద వాదిస్తున్నారు. కేసులు విచారణకు రాకుండా అడ్డుకోవడమే చంద్రబాబుకు తెలిసిన విద్య. సుధీర్ఘకాలం దర్యాప్తు జరిగాకే చంద్రబాబును అరెస్ట్ చేశారు. లేని ప్రాజెక్టులు ఉన్నట్లు చూపించి ప్రజాధనం దోచేశారు. సాక్షులను చంద్రబాబు దేశాలను దాటించగలడు. పెండ్యాల శ్రీనివాస్, పార్థసాని ఇద్దరూ రాత్రికి రాత్రే దేశం వదిలి పారిపోయారు. ఐటీశాఖకు చంద్రబాబు పరిధులు చెబుతున్నారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణకొచ్చారు. పురంధేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్‌గా కాకుండా, ఏపీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నాడో అర్థం కావడం లేదు. అమరావతి అంతా కుట్రనే. అన్ని వ్యవస్థలను మోసం చేశారు. తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలు మోహం చాటేస్తున్నారు. సొంతపార్టీ నేతలే టీడీపీని పట్టించుకోవడం లేదు. జాకీలు పెట్టి లేపినా టీడీపీ పార్టీ లేవదని సజ్జల పేర్కొన్నారు.