గుంటూరు : రాష్ట్ర సీఎంకు వ్యవసాయం అంటే కనీస అవగాహన లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియతో మాట్లాడుతూ కృష్ణా డెల్టాకు 15 వేల క్యూసెక్కుల నీరు అవసరమని, ఇప్పుడు కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కాలువల ద్వారా పొలాలకు వచ్చే సరికి నీరు ఇంకా తగ్గిపోతుందన్నారు. రైతుల పట్ల, పంటల పట్ల వైసీపీ ప్రభుత్వంలో కనీస సమీక్షలు లేవని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్టు చేసి సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని, ప్రస్తుతం వరి పంట పాలు పోసుకునే దశలో ఉంటే నీరు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కాలువల మరమ్మతులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారన్నారు. సీఎం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినా కృష్ణా జలాల అంశం మాట్లాడకుండా వచ్చేశారని, కేవలం సుప్రీంకోర్టులో పిటీషన్ వేస్తే సరిపోతుందా అంటూ ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.