ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగుళ్ల దాడుల కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ
వెలగపూడి : టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మూడు కేసులపై హైకోర్టు ఇటీవల విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వు చేసిం ఆయా కేసుల్లో తీర్పు వెల్లడించింది. ఏపీ రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ గత ఏడాది మే 9న పలువురిపై కేసు నమోదు చేసి చంద్రబాబును మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ వేశారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగుళ్ల దాడుల కేసు, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు వేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగుళ్ల దాడులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగుళ్ల దాడుల కేసులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఫైబర్ నెట్ కేసు ఇదే : టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది. చంద్రబాబు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. వాస్తవానికి ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాలి. కానీ ఈ ప్రాజెక్టును విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ చేపడుతుందని అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్ణయించారు.
పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా : ఫైబర్ నెట్ టెండర్లను తన బినామీ కంపెనీ అయిన టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా టెరా సాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ముందుగానే రెండు కీలక పదవుల్లో నియమించారు. తొలుత ఆయన్ని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ని అంతటి కీలక స్థానంలో నియమించడంపై అనేక అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు.
ఓ ప్రాజెక్టు టెండర్ల మదింపు కమిటీలో ఆ ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు ఉండకూడదన్న నిబంధననూ ఉల్లంఘించారు. టెరా సాఫ్ట్ సంస్థ అప్పటికే బ్లాక్ లిస్టులో కూడా ఉంది. అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కానీ చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చి బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి టెరా సాఫ్ట్ కంపెనీ పేరును తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి మరీ టెరా సాఫ్ట్ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేయడం గమనార్హం.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది.
అంగుళ్ల కేసు ఇదే : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు సంబంధించి చంద్రబాబు ప్రథమ ముద్దాయిగా పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డీఆర్.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద ఎస్ఐ షేక్ ముబిన్తాజ్ కేసు నమోదు చేశారు.
[https://bloomtimes.org/images/Heamalatha_/highcourt.jpg]