న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై దాడి రాజ్యాంగం పై దాడి * పాత్రికేయుల సమావేశంలోసిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ
రాజమహేంద్రవరం : రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పై పోలీసులతో నిర్బంధకాండ కొనసాగిస్తున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం కే జ్యోతి రాజు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియాపై మోడీ సర్కార్ ఉక్కు పాదం మోపిందని మోడీ అవలంబిస్తున్న విధానాలపై వాస్తవాలు బయటకు రాకుండా చేయడానికి న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై దాడి చేసి అక్రమ అరెస్టులు చేసిందని ఇది రాజ్యాంగానికి మాయని మచ్చని ఆమె అన్నారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ ప్రజాస్వామ్యవాదులు వామపక్ష భావాలపై పనిచేస్తున్న వారిపై దాడులు చేయడం చాలా సిగ్గుచేటని ఆమె విమర్శించారు కృష్ణ గోదావరి నదీ జలాల పంపిణీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి మోడీకి తాకట్టు పెట్టారని ఆమె అన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగానే నోటిఫికేషన్ విడుదల చాలా ఘోరమన్నారు కృష్ణా జలాలపై ప్రతిపక్షాలు రైతుల నేతలతో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసే విధానం చాలా ఘోరమని ఆమె అన్నారు మోడీ జగన్ కూడ కలుపుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని టిడిపి చేసే ప్రతి పోరాటానికి సిపిఐ మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు సహాయ కార్యదర్శిలు కొండ్రపు రాంబాబు రేఖ భాస్కరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వి కొండలరావు తోట లక్ష్మణ్ చింతలపూడి సునీల్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.