ఇపియఫ్ హయ్యర్ పెన్సన్ కు పిటిడి ఉద్యోగులు చెల్లించాల్సి డబ్బులు మేనేజ్ మెంటు చెల్లించాలి
ఆర్టీసి ఉద్యోగులో అన్నికేటగిరులలో ఉన్న ఖాళీలలో పదోన్నతలు ఇవ్వాలి
ఆర్టీసి ఉద్యోగులకు పాతపద్దతిలో వైద్యసౌకర్యాలు అందించాలి
క్యాడర్ స్ట్రెంగ్త్ సమస్యలు పరిష్కరించాలి
ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆర్టీసి ఉద్యోగులకు చెల్లిస్తామని అంగీకరించిన 3 సంవత్సరముల లీవ్ ఎన్ క్యాస్ మెంటు పిటిడి ఉద్యోగులకు ఇంకా చెల్లించక పోవడంపై ఆందోళన వ్యక్తమ వుతుందని వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేసారు. అదేవిధంగా పిటిడి ఉద్యోగులకు ప్రతి నెలా చెల్లించాల్సిన నైట్ అవుట్, డెయిలీ అలవెన్సులు చెల్లించాలని, ఓటి అలవెన్సులు జీతంతో పాటు చెల్లించాలని, కేడర్ స్ట్రెంగ్త్ సర్దుబాటు పేరుతో ఉద్యోగులను తగ్గించే చర్యలను విడనాడి సమస్యను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత సర్కులర్ ఆదేశాలను అమలు చేయాలని, కొంత మంది సూపర్ వైజర్లు మరియు అధికారుల పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నందున క్రిందిస్దాయిలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నందున ఉన్నతాధికార్లు చొరవ తీసుకొని సరిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అన్ని సెప్టెంబర్ ఆఖరు నాటికి చెల్లించ నందున ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ విషయంలో త్వరలో ప్రభుత్వ పెద్దలు దృష్టికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన తీసుకు తీసుకు వెళ్తామని తెలిపారు. విలీనానికి ముందు చేరిన ఆర్టీసి ఉద్యోగులకు పాత సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రమోషన్లు కలిపించే విషయం, పాతపద్దతులలో ఆర్టీసి ఉద్యోగులకు వైద్యసౌకర్యాలు కలిపించే విషయం, ఖాళీలను బర్తీ చేసే విషయాలలో ఎండీ , ప్రభుత్వం ఇద్దరూ సానుకూలంగా స్పందించారని త్వరలో వీటిపై సానుకూల నిర్ణయాలు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసి ఉద్యోగులకు సంబందించి ప్రభుత్వపరిధిలో ఏఒక్క సమస్య ఉన్నా సరే, ఎపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి అండగా ఉండి పని చేస్తామని బొప్పరాజు హామి ఇచ్చారు.
పలిశెట్టి దామోదర్ మాట్లాడుతూ డిపో, యూనిట్ లలోను జిల్లాపరిధిలో ఉన్న సమస్యలు పై త్వరలో అన్ని జోన్ కేంధ్రాలలో జోనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుకు మెమోరాండాలు ఇవ్వాలు ఇచ్చి అవసమైతే జోన్ స్దాయిలో ఆందోళణా కార్యక్రమాలకు కూడా వెనుకాడమని తెలిపారు. అలాగే బకాయిలు చెల్లింపులు హయ్యర్ పెన్షన్ చెల్లించాల్సి డబ్బులు చెల్లింపులు,క్యాడర్ స్ట్రంక్తు తదితర సమస్యలు పరిష్కారం కొరకు యం.డి కి కూడా లెఖ ఇవ్వాలని రాష్ట్రకార్యవర్గంలో నిర్ణయం జరిగిందని ఏపిపిటిడి రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వి నరసయ్య తెలిపారు. ఈసమావేశంలో ఆర్టీసి ఇ.యు కి ప్రభుత్వం గుర్తింపు ఇప్పించడంలో కీలకపాత్రపోషించిన బొప్పరాజు కి ఇ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు సత్కరించారు. ఈసమావేశంలో జి.ఓబుసు, ఆర్టీసీ రాష్ట్ర నాయకులు పి.సుబ్రహ్మణ్యం రాజు, చీఫ్ వైస్ ప్రెసిడెంటు కె.నాగేశ్వరరావు, ఉపప్రధాన కార్యదర్శులు జి.నారాయణరావు, యం.డి ప్రసాద్ , పి. భానుమూర్తి తోపాటు రాష్ట్రకమిటి సభ్యులు, నాలుగు జోన్లు, 26 జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు, నాలుగు వర్కుషాప్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.