అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన
బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో చంద్రబాబును
సీఐడీ మొదటి నిందితుడిగా పేర్కొంది. బెయిల్ పిటిషన్‌పై ఈనెల 27న వాదనలు
జరిగాయి. అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి నేటికి వాయిదా వేశారు. ఇప్పుడు
సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని నగరానికి
సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, దాన్ని
అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా
అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి
నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు
పిటిషన్ వేశారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా సుప్రీంకోర్టు సీనియర్
న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వాపరాలను కోర్టు
దృష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని వివరించారు