న్యూ ఢిల్లీ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన
ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. క్వాష్ పిటిషన్పై
విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక
చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని
చంద్రబాబు ఎస్ఎల్పీ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ను తిరస్కరిస్తూ గత
శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు
ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్
దాఖలు చేసిన విషయం తెలిసిందే. తొలుత చంద్రబాబు పిటిషన్పై విచారణ చేపట్టేందుకు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విముఖత వ్యక్తం చేశారు.
దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సిద్ధార్థ లూథ్రా సీజేఐ ముందు మళ్లీ
మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్
కోరుకుంటున్నారా? అని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. తాము బెయిల్ కోరుకోవడం
లేదని లూథ్రా తెలిపారు. ‘‘త్వరగా లిస్ట్ చేయాలన్నది మా మొదటి అభ్యర్థన.
మధ్యంతర ఉపశమనం కలిగించాలని రెండో అభ్యర్థన. 17ఏ అనేది కేసు మూలాల నుంచి
చర్చించాల్సిన అంశం. ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనుటువంటి
కేసు ఇది. మేము బెయిల్ కోరుకోవడం లేదు. ట్రయల్ కోర్టు జడ్జిని సంయమనం
పాటించాలని చెప్పలేం. జెడ్ కేటగిరీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని
ఇలా ట్రీట్ చేస్తారా? ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం.
యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారు.
పోలీసులు కస్టడీ అడుగుతున్నారు. దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాం’’
అని లూథ్రా పేర్కొన్నారు.